pop

బన్నీ ఈ హీరోయిన్‌కు ఎందుకు ఫోన్ చేశాడు..?


పెద్ద నోట్ల రద్దుతో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే.. శుక్రవారం విడుదలైన నిఖిల్‌ ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా’ సినిమా మాత్రం కలెక్షన్ల పండుగ చేసుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది ఈ చిత్రం. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన నందిత అభినయం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా దర్శకుడు ఆనంద్‌.. అల్లు శిరీష్‌తో ఓ సినిమా చేయనున్న నేపథ్యంలో బన్నీ ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా’ సినిమా చూశాడట. సినిమాతోపాటు నందిత నటన కూడా బన్నీకి తెగ నచ్చేసిందట. వెంటనే ఫోన్‌ అందుకుని నందితకు కాల్‌ చేశాడట బన్నీ. ఈ విషయాన్ని స్వయంగా నందితే వెల్లడించింది. ‘నా నటన నచ్చి బన్నీ నాకు ఫోన్‌ చేసి అభినందించారు. ‘వెల్కమ్‌ టు టాలీవుడ్‌’ అన్నారు. నాకు మీతో పనిచేయాలని ఉంది సార్‌ అని అడిగాన’ని చెప్పింది నందిత. తెలుగులో నటించిన తొలి సినిమాయే సూపర్‌ హిట్‌ కావడం ఆనందంగా ఉందని చెప్పింది నందిత.

No comments:

Powered by Blogger.