pop

హృతిక్‌తో రొమాన్స్‌ వెరీ వెరీ స్పెషల్‌


హృతిక్‌ రోషన్‌ లాంటి హ్యాండ్సమ్‌ హీరోతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ అంటే ఆ కిక్కే వేరంటోంది యామీ గౌతమ్‌. హృతిక్‌తో కలిసి 'కాబిల్‌' సినిమాలో నటిస్తోన్న యామీ, ఈ సినిమాని తన కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్‌.. అని చెబుతోంది. అవును మరి, అటు హృతిక్‌, ఇటు యామీ.. ఇద్దరూ ఈ సినిమాలో అంధులుగా కన్పిస్తున్నారు. ఇప్పటికే 'కాబిల్‌' ప్రోమోస్‌ సినిమాపై హైప్‌ని విపరీతంగా పెంచేశాయి. ఇదేదో ఆర్ట్‌ ఫిలిం.. అనుకోవద్దనీ, సినిమాలో అన్ని కమర్షియల్‌ అంశాలూ వుంటాయని అంటోంది యామీ గౌతమ్‌. ఇద్దరు అంధుల మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ని చిత్రీకరించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదనీ, ఆ పాత్రల్లో నటించడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నామనీ యామీ గౌతమ్‌ చెప్పుకొచ్చింది. షూటింగ్‌ సందర్భంగా అక్కడక్కడా తాను ఇబ్బందిపడుతున్న సన్నివేశాల్లో హృతిక్‌ తనకు అండగా నిలిచాడనీ, కొన్ని టిప్స్‌ చెప్పడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని చెప్పిందామె. 'కాబిల్‌' తర్వాత, హృతిక్‌తోనే రెగ్యులర్‌ కమర్షియల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ చెయ్యాలని వుందట యామీ గౌతమ్‌కి. ఎందుకు.? అనడిగితే, 'కాబిల్‌'లో రొమాంటిక్‌ సీన్స్‌ వున్నా, వాటికి కొన్ని పరిమితులున్నాయనీ, అంధుల పాత్రలు కావడంతో, కళ్ళను బ్లాంక్‌గా పెట్టవలసి వచ్చిందని చెబుతోంది యామీ గౌతమ్‌.

No comments:

Powered by Blogger.