pop

చిచ్చుపెట్టిన పెద్దనోటు..!


MBDBభూమి అమ్మగా వచ్చిన డబ్బును కూతుళ్లకు పంచడంలో వివాదం, పాత నోట్లు మార్పిడిపై ఆందోళనతో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ మండలం జిల్లా శనిగపురం గ్రామానికి చెందిన కందుకూరి ఉపేంద్రాచారి, వినోద(54) దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమీప గ్రామమైన ముడుపుగల్ శివారులో ఉన్న 12 ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించారు. రూ. 54.40 లక్షలు చేతికొచ్చాయి. ఆ డబ్బుతో మరోచోట భూమి కొనుగోలు చేద్దామనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉంచారు. ఉపేంద్రాచారి పక్షవాతం బారిన పడటంతో చికిత్స కోసం రూ.11 లక్షలు ఖర్చుచేశారు. బ్యాంకులో ఉమ్మడి ఖాతా తెరిచి రూ.43.40 లక్షలు జమ చేయాలని ఇటీవల కుటుంబ సభ్యులు నిర్ణయించగా, తన పేరిటే ఖాతా తీయాలని కొడుకు శ్రీనివాస్ వాదించాడు. కూతుళ్లకు కొంత డబ్బు ముట్టజెప్పాలని తల్లి వినోద గట్టిగా కోరగా లొల్లి జరుగడంతో డబ్బు అలాగే ఉంచారు. మంగళవారం రాత్రి కేంద్రప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించినప్పటి నుంచి వీరిలో ఆందోళన ఎక్కువైంది. MBDB డబ్బు మార్పిడి ఎలా చేయాలనే విషయమై బుధవారం రాత్రి వరకు ఇంట్లో వాదోపవాదాలు జరిగాయి. కూతుళ్లు, అల్లుళ్ల ఖాతాల్లో జమ చేద్దామని తల్లి వినోద సూచించగా కుమారుడు శ్రీనివాస్ నిరాకరించడంతో పెద్ద లొల్లి జరిగింది. దీంతో మనస్తాపం చెందిన వినోద బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు చీరెతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. పక్షవాతంతో మంచానపడ్డ ఉపేంద్రాచారికి సపర్యలు చేయడానికి నియమించిన లక్కు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి తలుపుకొట్టాడు. తలుపు తీసేందుకు వస్తుండగా, తన తల్లి ఉరివేసుకుని కపిపించిందని లక్కుకు శ్రీనివాస్ తెలిపాడు. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుళ్లు మాధవి, శశికళ వచ్చి తల్లి మృతదేహంపై పడి విలపించారు. అమ్మను అన్నా, వదిన కొట్టి చంపారని ఆరోపించారు

No comments:

Powered by Blogger.