pop

వీళ్ళకూ వచ్చాయి తిప్పలు


పెద్ద నోట్ల రద్దు సెక్స్ వర్కర్లకూ శాపంలా పరిణమించింది. దేశంలోనే అతి పెద్ద రెడ్ లైట్ జిల్లా అయిన సోనాగచి (పశ్చిమ బెంగాల్) లో వీళ్ళ బిజినెస్ చాలావరకు పడిపోయింది. అక్కడ సుమారు 11 వేలమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లు పాత 500, వెయ్యి నోట్లే ఇస్తున్నారని, దీంతో తామెన్నో చిక్కులు ఎదుర్కొంటున్నామని వీరు వాపోయారు. బ్యాంకుల ముందు చాలాసేపు క్యూలలో నిలబడాల్సి వస్తోంది..ఫలితంగా మా బిజినెస్ తీవ్రంగా దెబ్బ తింటోంది అని ఈ అంగడి బొమ్మలు విలపించినంత పని చేస్తున్నారు. అయితే తమ బాసులు (నిర్వాహకులు) పాత నోట్లనే తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, తమ వద్దకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోయిందని వీళ్ళు తెలిపారు. చిన్న నోట్లతో వస్తున్న ఒకరిద్దరి వల్ల తమ ఆదాయం దెబ్బ తింటోందని వారు తెలిపారు. ఢిల్లీ లోని రెడ్ ఏరియా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.

No comments:

Powered by Blogger.