pop

డోనాల్డ్ ట్రంప్‌కు ఓటేశారూగా.. నెలపాటు సెక్స్‌కు నో: అమెరికాలో భర్తకు భార్య షరతు


hillary vs trumpఅమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనూహ్య గెలుపును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. సర్వేలు హిల్లరీ క్లింటన్‌నే విజయం వరిస్తుందని చెప్పినా..ట్రంప్‌కే గెలుపు సాధ్యమైంది. దీంతో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేసిన పాపానికి.. ఇంట్లో షరతులతో కూడిన జీవితం గడుపుతున్నానని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తన గోడును షేర్ చేసుకున్నాడు. అందులో అమెరికా వ్యక్తి ఏం చెప్పాడంటే.. తన భార్య తాను ఎప్పటికీ విరుద్ధంగానే వ్యవహరిస్తామని, నేను సినిమాకు వెళ్దామంటే.. ఆమె హోటల్‌కు వెళ్దాం అంటోందని.. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు ఆమె ఓటేస్తే.. నేను డొనాల్డ్ ట్రంప్‌‍కు ఓటేశానని చెప్పుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుందని.. ఆ జగడం కాస్త ముదిరి.. ఒక నెలకు సెక్స్‌కు నో అంటూ అడ్డం తిరిగిందని తెలిపాడు.

No comments:

Powered by Blogger.