కేరళలో రబ్బర్ కోడిగుడ్లు.. చైనా చేతివాటం.. ఉడకబెట్టామో.. బాల్ అయిపోద్ది..
నా గుడ్లను కోళ్లు పెట్టవు. వాటిని కెమికల్స్ వాడి తయారు చేస్తుంటారు. గోధుమ రంగులో ఈ కోడిగుడ్లపై ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ గుడ్లను సూపర్ మార్కెట్‌లోకూడా అమ్ముతున్నారు. మామూలు కోడిగుడ్ల కంటే ఇది గట్టిగా ఉంటుంది. నీటిలో ఉడకబెట్టామనుకోండి.. రబ్బర్ బాల్‌లా తయారవుతుంది. అదీ చైనా కోడిగుడ్డు కథ. రుచి మన ఊరి గుడ్డులా ఉండదంతే. ఎన్ని నెలలైనా చెడిపోని ఈ గుడ్లు తమిళనాడు నుంచి కేరళకు వస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కోడిగడ్లపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో చైనా నుంచి ప్లాస్టిక్ రైస్ దిగుమతై కలకలం సృష్టించిన నేపథ్యంలో.. చైనా కృత్రిమ కోడిగుడ్లపై రచ్చ రచ్చ జరుగుతోంది
No comments: