pop

షాకింగ్ న్యూస్ః జ‌న‌వ‌రి 1 నుంచి వాట్సాప్ బంద్..?



whatsupఅవును పాత పాత స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నవాళ్ళంతా డిసెంబరు 31 తరువాత నుంచి వాట్సాప్ సౌకర్యానికి నోచుకోకపోవచ్చు. సింబియాన్, బీబీవోస్, విండోస్, యాండ్రాయిడ్, ఐ వోఎస్ ఆపరేటింగ్ సిస్టం వంటి వెర్షన్లకు వాట్సాప్ బహుశా అందుబాటులో ఉండే సూచనలు ఉన్నాయి.దీనికి గ‌ల కార‌ణం ఏమిటంటే వచ్చే ఏడాది నుంచి కొత్త ఫోన్లే ఈ సౌకర్యాన్ని ఓవర్ టేక్ చేసే అవకాశం ఉందట. అంటే పాత ఫోన్లవారికి అప్ డేట్స్ ఉండవు. థర్డ్ పార్టీ డెవలపర్లు.. వాట్సాప్ పని చేసేలా కొన్ని మోసపూరిత పద్ధతులకు పాల్పడవచ్చు. కానీ వీటిని తాము రికమెండ్ చేయలేదని, ఆ సమాచారంలో నష్టం కలిగించే అంశాలు ఉండవచ్చునని ఈ యాప్ వర్గాలు పేర్కొంటున్నాయి.. బ్లాక్ బెర్రీ, (బ్లాక్ బెర్రీ 10), నోకియా ఎస్ 40, నోకియా సింబియన్ ఎస్ 60, యాండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ ఫోన్ 7.1, ఐ ఫోన్ 3 జీఎస్/ఐఓఎస్ 6, వంటి మొబైల్స్ కు డిసెంబరు 31 నుంచి ఈ వెసులుబాటు ఉండకపోవచ్చునని, అందువల్ల వీటిని వాడుతున్నవారు కొత్త వెర్షన్ల ఫోన్లు వాడితే బెటరని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో 95 శాతానికి పైగా ప్రజలు దీన్ని వాడుతున్నారు. పాత ఫోన్లలో ఈ సౌకర్యం పూర్తిగా బ్లాక్ కాకపోయినా.. చాలా ఫీచర్స్ ని ఈ ఫోన్లు ప్రెజెంట్ చేయలేకపోవచ్చునని చెబుతున్నారు నిపుణులు.

No comments:

Powered by Blogger.