pop

రూ.100 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత...!


రూ.100 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత...!రూ.100 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత...! ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. కొత్త నోట్ల ప్రింటింగ్‌లో బిజీగా ఉన్న ప్రెస్‌లు రూ.100 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఆర్‌బీఐ వర్గాలను ఉటంకిస్తూ... ‘బ్లూంబర్గ్’ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇది నిజంగా మింగుడుపడని అంశమే. అరుుతే, నోట్ల రద్దుపై వార్తల్లో వస్తున్న ఈ అభిప్రాయాలు, అంచనాలను ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ తోసిపుచ్చారు. ‘ఇది పూర్తిగా అవాస్తవం. త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతారుు. రూ.500, 100 నోట్ల సరఫరా పెరిగి.. ఏటీఎంల రీ-కాలిబ్రేషన్ పూర్తరుుతే ఇప్పుడున్న ఇబ్బందులన్నీ చాలా వేగంగానే తొలగిపోతారుు’ అని ఆయన పేర్కొన్నారు. అరుుతే, అవసరానికి సరిపడా రూ.100 నోట్ల సరఫరా లేదని, కొరత ఉన్నట్లు ఆర్థిక శాఖకు చెందిన అధికారులు(పేరు వెల్లడించడానికి ఇష్టపడని) చెబుతున్నారు. కాగా, రెండు నెలల క్రితమే నోట్ల ప్రింటింగ్ మొదలైందని.. దీనివల్ల కరెన్సీ సరఫరా తగినంతగానే ఉందని ఆర్‌బీఐ గు
రువారం ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

No comments:

Powered by Blogger.