pop

పాము పొట్ట చీల్చితే.. ఏం బయట పడిందో తెలిస్తే షాక్ అవుతారు


నైజేరియా: పశ్చిమాఫ్రికాలోని నైజేరియాలో ఓ గ్రామ వాసులకు నిండైన పొట్టతో ఉన్న భారీ పాము కనిపించింది. తమ దూడను అది తినిందోమో అని వారికి అనుమానం వచ్చింది. అంతే దాని పొట్టలో ఏముందో చూడాలని పామును చంపి, పొట్ట కోసి చూశారు. కానీ, వారి అనుమానం నిజం కాలేదు. వారు అనుకున్నట్టుగా అది ఏ దూడను తినలేదు. ఆ పాము నిండు గర్భంతో ఉంది. అందులో పొదగడానికి సిద్ధంగా ఉన్న డజన్ల కొద్ది గుడ్లు తప్ప ఏమీ లేవు. అది ఏ జాతి పామో స్పష్టంగా తెలియక పోయినా, దాని ఆకారాన్ని బట్టి అది ఆఫ్రికా రాక్‌ పైతాన్‌ అని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చనిపోయిన పాము పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Powered by Blogger.