pop

బాలుడి తలలో పవర్‌ ప్లగ్గు!


బీజింగ్‌: చైనా గ్వాంగ్‌డాంగ్ రాష్టంలోని గ్వాంగ్‌ఝో నగరంలో ఓ రెండేళ్ల బాలుడు మంచంపై ఆడుకుంటూ అకస్మాత్తుగా పవర్‌ ప్లగ్గు మీద పడ్దాడు. బాలుడి తలలోకి లోతుగా ప్లగ్గు గుచ్చుకుంది. తీవ్రంగా ఏడుస్తున్న అతడిని తల్లిదండ్రలు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యలు రెండు సెంటీమీటర్ల తోతులో ప్లగ్గు గుచ్చుకుందని ఎక్స్‌రే ద్వారా తెలుసుకున్నారు. శస్త్రచికిత్స చేసి ప్లగ్గును తొలగించారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు. తల నుంచి ప్లగ్గు తీయడానికి ప్రయత్నించకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చినందుకు బాలుడి తల్లిదండ్రులను వైద్యులు అభినందించారు. ప్లగ్గు వల్ల బాలుడి తలలో ఓ రక్తనాళం అప్పటికే దెబ్బతినిందని, ఒక వేళ ప్లగ్గును తీసేందుకు ప్రయత్నించి ఉంటే తీవ్రంగా రక్తస్రావం అయ్యేదని చెప్పారు.

No comments:

Powered by Blogger.