pop

సైఫ్‌ కుమార్తె తెరంగేట్రం?


ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ తెరపై కనిపించబోతున్నారని చాలా రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న జోయా అక్తర్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో సారా కథానాయిక పాత్ర పోషించనున్నట్టు బాలీవుడ్‌ టాక్‌. చిత్ర నిర్మాతలు ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వానీలు దర్శకుడు జోయా అక్తర్‌తో కలిసి కథానాయిక పాత్ర కోసం సారాను కలిసినట్లు సమాచారం. ఇదే నిజమైతే బాలీవుడ్‌లో మరో అందమైన జంట తెరపై కనిపించబోతోందని అంటున్నారు. రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘బేఫికర్‌’ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆయన సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

No comments:

Powered by Blogger.