pop

లులియా త్యాగం సల్మాన్‌ కోసమేనా?


ముంబయి: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న భామ లులియా వంతూర్‌. ఆమె రొమేనియా వెళ్లిపోయిందని, సల్మాన్‌కు ఆమెకు మధ్య ఉన్న బంధం తెగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లులియా చెప్పిన సంగతులు.. సల్మాన్‌, ఆమె విడిపోయారన్నది కేవలం వట్టి పుకార్లే అని తేటతెల్లం చేస్తున్నాయి. ‘నేను హిందీలో పాడటం నేర్చుకుంటున్నాను. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. అక్కడ(ఇండియాలో) వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వాలు, సంప్రదాయం, జనాలు.. ఇలా ప్రతిదీ విభిన్నంగానే ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. ఒకే ఇంటిలో చాలా మంది జీవిస్తుంటారు’ అని లులియా ఓ రొమేనియా మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో లులియా తనకు కష్టమైన పనిని సల్మాన్‌ కోసమే చేస్తోందని, వారిద్దరి మధ్య ప్రేమబంధం ఇంకా కొనసాగుతూనే ఉందని బాలీవుడ్‌ టాక్‌.

No comments:

Powered by Blogger.