pop

సమంత ముద్దు పై హాట్ టాపిక్ !


సమంత ముద్దు పై హాట్ టాపిక్ !సమంత ఎలా మాట్లాడిన ఏమి చేసినా సంచలనమే. సమంత మాదాపూర్ లోని కావూరి హిల్స్ వద్ద కొత్తగా ప్రారంభమైన 'టి గ్రిల్' అనే రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో చిట్టి గౌను వేసుకుని వచ్చి చేసిన ముద్దుల హడావిడి హాట్ టాపిక్ గా మారింది. హీరో నితిన్, సమంత పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజలు కలిసి భాగస్వాములుగా ఈ రెస్టారెంట్ బిజినెస్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా సమంత తనకు అత్యంత ఆప్తురాలైన నీరజ బుగ్గపై ముద్దు పెడుతూ రిబ్బన్ కట్ చేసి మీడియాకు పోజులు ఇచ్చింది. అంతేకాదు ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో మీడియా వర్గాలు చైతూ సమంతల పెళ్ళి విషయమై అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తమ పెళ్లి డేట్ ఇంకా డిసైడ్ కాలేదు అంటూ పెళ్లి ఎక్కడ అనేది కూడా ఇంకా తెలీదు అని చెపుతూ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం ఈ రెస్టారెంట్ లోనే జరుగుతుంది అంటూ అందరికీ షాక్ ఇచ్చింది సమంత. అయితే ఈవిషయం ఈమె సరదాగా జోక్ చేసిందా లేక నిజంగానే అన్నదా అన్న విషయం పై క్లారిటీ లేదు. ఈ కార్యక్రమానికి సమంత వేసుకు వచ్చిన డ్రెస్ కూడ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఏదైనా న్యూ ఫ్యాషన్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే సమంతా తర్వాతే ఎవరైనా అన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ తాను ఏ విషయంలో అయినా ట్రెండ్ సెట్టర్ అని మరోసారి నిరూపించుకుంది. మెరూన్ కలర్ గౌన్ లో మెరిసిన సమంతా షార్ట్ గౌన్ తో స్టైలిష్ లుక్ లో మెరిసిపోయింది. స్టైలిష్ కాలర్ నెక్ ఏరియాలో ప్లెయిన్ నెట్ తో ఉన్న ఫ్రిల్డ్ గౌన్ లో సమంత చాల గ్లామర్ గా కనిపించింది. అంతేకాదు ఆమె చేతిలో సేమ్ మెరూన్ కలర్ వెల్వెట్ బ్యాగ్ అడిషనల్ ఎ్రటాక్షన్ గా మారింది. చెవులకి స్టడ్స్ మినహా ఎలాంటి యాక్ససరీస్ లేకుండా కేవలం చిట్టిగౌన్ లోనే అందర్నీ ఆకర్షించింది సమంత. దీనితో ఆ రెస్టారెంట్ ప్రారంభానికి వచ్చిన మీడియా వర్గాలు అంతా సమంత గౌను వైపే చూస్తూ శామ్స్ వల్ల ఆ గౌన్ కి అందమొచ్చిందో లేక ఆ గౌన్ కలర్ వల్ల సమంతకు ఇంకా అందం పెరిగిందా ? అంటూ జోక్స్ వేసుకున్నట్లు టాక్..

No comments:

Powered by Blogger.