pop

ట్రంప్ టవర్‌కు పెరుగుతున్న క్రేజ్‌…


అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నివాసం, వ్యాపార సముదాయమైన ట్రంప్‌ టవర్‌కు క్రేజ్‌ రోజు రోజుకు పెరిగిపోతుంది. స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ టవర్‌ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఎంతలా అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులకు ఇక చాలు వెళ్లండి అని విసిగిపోయేంతగా. అంతేకాదు వీరికి అదనంగా తాజాగా పోలీసులు కూడా అక్కడికి పెద్ద మొత్తంలో చేరారంట. వీరందురూ భద్రత నిమిత్తం ఆంక్షలు పెడుతున్నప్పటికీ సెల్ఫీలు మాత్రం ఆపడం లేదంట. ఎన్నికల నిర్వహణ తేది ప్రకటించినప్పటి నుంచి ఈ తంతు మొదలైందని, ఇప్పుడు ట్రంప్‌ విజయం సాధించడంతో అది కాస్త మరింత ఎక్కువైందని అక్కడి వారు భావిస్తున్నారు.

No comments:

Powered by Blogger.