pop

హాట్ ఆంటీ.. కోర్టు మెట్లు ఎక్కేసింది


Related imageదాదాపు ఏడాదిగా బాలీవుడ్ జంట మలైకా అరోరా.. అర్బాజ్ ఖాన్‌ల గొడవ సీరియల్ లాగా నడుస్తోంది. ఇద్దరూ గొడవపడి విడిపోయారని.. వేరుగా ఉంటున్నారని.. మలైకా కొత్తగా అర్జున్ కపూర్‌తో ఎఫైర్ పెట్టుకుందని.. అతడి తండ్రి బోనీ కపూర్ వార్నింగ్ ఇచ్చాడని రకరకాల వార్తలొచ్చాయి. ఐతే మధ్యలో మలైకా-అర్బాజ్ తిరిగి కలుస్తున్నట్లు కూడా రూమర్లు వినిపించాయి. ఐతే ఇందులో ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో తెలియక జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఐతే ఎట్టకేలకు ఈ వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్ అధికారికంగానే విడిపోతున్నారు. వాళ్లిద్దరూ కలిసి డైవర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కేశారు. ముంబయిలోని బాంద్రా కోర్టులో మలైకా-అర్బాజ్ విడాకుల కోసం పిటిషన్ వేశారు. 49 ఏళ్ల అర్బాజ్.. 43 ఏళ్ల మలైకా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గత మార్చి నుంచి వీళ్లిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఐతే అప్పట్లో వాళ్లిద్దరినీ తిరిగి కలపడానికి ఇరు కుటుంబాల సభ్యులు ప్రయత్నాలు చేశారు. దీంతో విడాకుల వరకు వెళ్లలేదు. మధ్యలో అర్బాజ్-మలైకా కలిసి ఒక డిన్నర్‌కు వెళ్లడంతో వీళ్లిద్దరూ తిరిగి కలిసిపోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఐతే అర్బాజ్‌తో కలవడానికి మలైకా అస్సలు ఇష్టపడట్లేదని సమాచారం. వీళ్లిద్దరూ 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత కూడా మలైకా సినిమాల్లో హాట్ హాట్ ఐటెం సాంగ్స్ చేయడం విశేషం.

No comments:

Powered by Blogger.