pop

ఆ చెక్కు బరువు 15 కేజీలు!


దిల్లీ: ఇరవై వేల రూపాయల చెక్కుతో బ్యాంకుకొచ్చిన ఓ వ్యక్తి 15 కేజీల బరువుతో ఇంటికి చేరాల్సి వచ్చింది. దిల్లీకి చెందిన ఇంతియాజ్‌ ఆలమ్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. అతను చెక్కును మార్చుకోవడానికి జామియా సహకార బ్యాంకుకు వెళ్లగా అప్పటికే చాలామంది బారులు తీరి ఉన్నారు. దీంతో వరుసలో 4 గంటలు నిల్చున్న తరువాత అతని వంతు వచ్చింది. బ్యాంకు కౌంటర్‌ వద్ద చెక్కు ఇచ్చిన అతనికి సిబ్బంది మొత్తం 10 రూపాయల నాణేలు (2,000) సంచిలో పెట్టి చేతికందించారు. వాటి బరువు 15 కేజీల 420 గ్రాములుందని, తాను మోయలేక రిక్షావాలాను పిలిచి ఇంటికి వెళ్లినట్లు ఇంతియాజ్‌ తెలిపారు. తన ఇల్లు మూడో అంతస్తులో ఉండటంతో అపసోపాలు పడి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఫొటోను అతను ఫేస్‌బుక్‌లో పెట్టడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

No comments:

Powered by Blogger.