pop

సమంత రెడీయే, కానీ..!


తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగింది సమంత. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పింది. నాగచైతన్య కూడా సమంత సినిమాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోదని ప్రకటించాడు. తమ పెళ్లి ఈ ఏడాదే ఉంటుందనుకుని సమంత ఎన్నో సినిమా ఆఫర్లను రిజెక్ట్‌ చేసింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చైతూ ప్రకటించడంతో సమంత రెండు తమిళ సినిమాలను అంగీకరించింది. కానీ, ఆమెకు తెలుగులో మాత్రం ఆఫర్లు రావడం లేదు. సినిమాలకు సిద్ధమేనని ప్రకటించినా చాలామంది సమంతను పట్టించుకోవడం లేదు. సమంత ఇప్పటికే రామ్‌చరణ్‌, ప్రభాస్‌ తప్ప మిగిలిన తెలుగు స్టార్‌ హీరోలందరితోనూ జతకట్టేసింది. కాబట్టి వారంతా పెళ్లికి సిద్ధపడుతన్న సమంత కంటే ఫ్రెష్‌ ఫేస్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి సమంత తమిళ సినిమాలతో సరిపెట్టుకుంటోంది.

No comments:

Powered by Blogger.