త్రిష, హన్సిక..ఇద్దరికి ఒకేసారి దెబ్బకొట్టి షాక్ ఇచ్చాడు, కంప్లైంట్ చేసారు
'ఎవరో పనిలేనివాళ్లు నా ఫోన్‌లో ఉన్న డేటానంతా చెరిపేశారు.అందుకని నా ఫోన్ నంబర్ తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషులందరూ మీ పేరుతో మీ ఫోన్ నంబర్ జతచేసి నా ఫోన్‌కి మెసేజ్ పెట్టగలరు'' అని త్రిష పేర్కొన్నారు. ఇక ఈ విషయమై తను సైబర్ క్రైమ్ సెల్ కు వెళ్లినట్లుగా ఆమె తెలియచేసారు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ విషయమై ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే వీరి ఫోన్ లను హ్యాక్ చేసినవారి ని పట్టుకునే ఉన్నట్లు సమాచారం. ఇక త్రిష ట్వీట్ వచ్చిన కొద్ది సేపటికే ..హన్సిక... ''నా ఫోన్ పరిస్థితి కూడా ఇదే. అందుకని నాక్కూడా మెసేజ్ పెట్టగలరు'' అని విన్నవించుకున్నారు. ఇలా హ్యాక్ చేసి వీళ్లకు సమస్యలు తెచ్చిపెట్టినవాళ్లు త్వరలోనే సమస్యలు పాలు అవుతారని , అభిమానులు వీళ్లిద్దరినీ ఓదారుస్తున్నారు. మొత్తానికి ఇద్దరు హీరోయిన్స్ కు ఒకే సమస్య, ఒకేసారి రావటంతో తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
No comments: