pop

అందాన్ని చూపిస్తూ అందినకాడికి దోచుకుంటుంది


రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్ కు చెందిన ఖుష్బూ శర్మ అనే 28 ఏళ్ల యువతి ఫేస్‌బుక్ ద్వారా అందరికీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తూ వారితో పరిచయాన్ని పెంచుకొని ఆపై తన అందాన్ని ఎరవేస్తుంది. ఈ క్రమంలో వారి నుంచి అందిన కాడికి దోచుకొని ఉడాయిస్తుంది. ఈమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఖుష్బూపై ఇప్పటివరకూ వివిధ ప్రాంతాల్లో దాదాపు 150 వరకు కేసులు నమోదయ్యాయి. ఖుష్బూ శర్మకు స్మృతి శర్మ, లేడీ కోకా అని అలియాస్ గా చాలా పేర్లే ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తనకు తానుగా సుప్రీంకోర్టులో లాయర్ అని, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అని లేదా అలాంటి వారి కుటుంబానికి చెందిన అమ్మాయిగా చెప్పుకుంటుంది. ఈ రకంగా సెలబ్రిటీలను, పెద్ద పెద్ద ఆఫీసర్లను, బాగా ధనవంతులైన వారిని స్నేహితులుగా చేసుకుంటుంది. వారితో కలిసి పార్టీలకు, కాఫీ షాప్స్ , రెస్టారెంట్స్, షాపింగ్స్ అంటూ తిరుగుతుంది. వారితో చాలా సన్నిహితంగా మెలుగుతూ సెల్ఫీలు తీసుకుంటుంది. ఇక ఆపై ఆ ఫోటోలు చూపించి డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది. లేకపోతే రేప్ కేసు పెడతాను అని వారిని బెదిరిస్తుంది. ఈ రకంగా ఈమె బాధితులు ​ ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లలో ఉన్నారు.
ఈ మధ్యకాలంలో బెంగళూరులోని ఓ ప్రముఖ లాయర్ వద్దకు వెళ్లి తనకు ఉద్యోగం కావాల్సిందిగా కోరింది. ఆయన లేదని చెప్పటంతో మరో రకంగా ఆయన దృష్టి మళ్లించి... ఆ లాయర్ ఇంటి నుంచి రూ. 1.35 లక్షల నగదుతో పాటు ఆయన ఐఫోన్‌ను ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఇటీవల ఖుష్బూ మళ్లీ ఆ లాయర్‌కి డబ్బు కోసం ఫోన్ చేయటంతో పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది ఢిల్లీలో రోడ్డుపై వెళ్లే ఓ వ్యక్తిని ​ ఖుష్బూ లిఫ్ట్ అడిగింది. ఆ తర్వాత అతన్ని మాటలతోనే మచ్చిక చేసుకొని తనను అనుభవించుకోమని ఆఫర్ ఇచ్చింది. అతన్ని 'ప్రొటెక్షన్' కొనమని చెప్పడంతో ఓ మెడికల్ షాప్ దగ్గర కారుని ఆపి. 'ప్రొటెక్షన్' కొనటానికి కారు దిగి వెళ్లగానే ఈమె ​ ఆ కారుతో ఉడాయించింది. అప్పుడు కేసు నమోదవ్వగా బెయిల్‌పై విడుదలై తిరుగుతోంది. ఇప్పుడు మళ్లీ జైలు పాలైంది.

No comments:

Powered by Blogger.