pop

మరణశిక్షపై ఐరాసతో విభేదించిన భారత్


మరణశిక్షపై మారటోరియం విధిస్తూ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. మరణశిక్షపై మారటోరియం భారత చట్టాలకు, సార్వభౌమాధికారహక్కుకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. ప్రతి దేశానికి న్యాయ వ్యవస్థ ఉంటుందని, ఈ విషయాన్ని అది మాత్రమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే దేశీయ చట్టాలను అభివృద్ది చేసేందుకు సార్వభౌమాధికార హక్కును సవరించాలన్న వాదనతో భారత్ అంగీకరించింది. భారత ప్రతినిధి మయాంక్ జోషి మాట్లాడుతూ ప్రతీ దేశానికి తన న్యాయవ్యవస్థపై నిర్ణయం తీసుకునే సార్వభౌమాధికారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను సవరణకు ఓటేసినట్టు తెలిపారు. అయితే యూఎన్ మిషన్‌లోని భారత కౌన్సిలర్ మాత్రం ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడారు. మయాంక్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలిపారు. భారతీయ చట్టాలకు ఆ తీర్మానం వ్యతిరేకంగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా భారత్‌లో మరణశిక్ష అనేది చాలా అరుదు. ఘోరాతిఘోరమైన నేరాల విషయంలోనే మరణశిక్ష అమలు చేస్తున్నారు. ఈకారణంగా ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

No comments:

Powered by Blogger.